logo
సినిమా

మొన్నేగా పెళ్లైంది.. అప్పుడేనా..

మొన్నేగా పెళ్లైంది.. అప్పుడేనా..
X
Highlights

దశాబ్ధకాలం తెలుగు సినిమా రంగాన్ని ఏలీ.. బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని నటనకు కొంత గ్యాప్ ఇచ్చింది హీరోయిన్...

దశాబ్ధకాలం తెలుగు సినిమా రంగాన్ని ఏలీ.. బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని నటనకు కొంత గ్యాప్ ఇచ్చింది హీరోయిన్ శ్రియ. మళ్లీ ఎప్పటిలాగే సినిమాల్లో నటించడానికి సిద్ధమైపోయింది. పెళ్లికిముందే ఓ సినిమాకు సైన్ చేసిన శ్రీయ. ఆ సినిమాకోసం మళ్ళి మేకప్ వేసుకుంటోంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించిన శ్రియ సీనియర్ హీరోల పక్కన మంచి చాయిస్‌గా ఉంటోంది. పెళ్లయిన తరువాత తన భర్తకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటానన్న శ్రియ అన్న కొద్ది రోజుల్లోనే కెమేరా ముందుకు వచ్చింది. మళ్లీ నటిస్తానని చెప్పే సరికి ఆమె కోసం లేడీ ఓరియంటెడ్ కథను తయారు చేశారు దర్శకులు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదన్న రూలేమీ లేదు కదా. అందుకే వచ్చేశాను. ఓ ఇరవై సినిమాల్లో నటించిన తరువాత పిల్లల గురించి ఆలోచిస్తాను. అని చెప్పింది. దాంతో ఆమె అభిమానులు మొన్నేగా పెళ్లయింది అప్పుడే కెమెరా ముందుకు వస్తారా అని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు.

Next Story