నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. నిధులు దుర్వినియోగం అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒక వర్గం అంటుంటే మరో వర్గం మాత్రం నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనంటోంది. మా..లో అసలేం జరిగింది.
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా..లో నిదులు గోల్మాల్ జరిగినట్టు కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. మా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి అమెరికాలో ప్రదర్శన హక్కుల విషయంలో అవకతవకలు జరిగాయని పరిశ్రమలో ఓ వర్గం ఆరోపిస్తోంది. ప్రధానంగా అధ్యక్షుడు శివాజీరాజాతోపాటు అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హీరో శ్రీకాంత్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మా కి సొంత భవనం కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా మా అసోసియేషన్‌కు కోటి రూపాయల నిధులు సమకూరాయి. అయితే, ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్టు ప్రధాన ఆరోపణ. ఈ కోటి రూపాయలు కాకుండా అదనంగా కొంత డబ్బు అసోసియేషన్‌కు చెందిన బినామీ అకౌంట్లోకి చేరినట్టు ఓ వర్గం ఆరోపిస్తోంది. దీనిపై నిజనిర్దారణ కమిటీ వేయడానికి కూడా అసోసియేషన్ పెద్దలు ఒప్పుకోవడం లేదంటున్నారు.
ఈ ఆరోపణలపై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీరాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తదితరులు మరోసారి సమావేశమై చర్చించారు. అయితే, దీనికి జనరల్ సెక్రటరీ నరేష్ హాజరుకాలేదు. నిధుల సమీకరణలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మా సభ్యులు కొట్టిపారేశారు. అసోసియేషన్‌లో 5 పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని శివాజీ రాజా సవాల్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే అసోసియేషన్ గడప కూడా తొక్కనని, నిరూపించలేకపోతే ఆరోపణలు చేస్తున్న వారు మా నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హీరో శ్రీకాంత్. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం, శ్రీరెడ్డి విషయంలో టాలీవుడ్ వివాదంలో చిక్కుకోగా.. తాజా వివాదం మరోసారి ‘మా’ను అప్రతిష్ట పాలు చేసేలా ఉంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
PM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMT