logo
జాతీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
X
Highlights

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 13 మంది...

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన షిమ్లాకు 150 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి షిమ్లావైపు వెళుతున్న జీపు స్నేయిల్ రోడ్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అందులో నలుగురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారని షిమ్లా సూపర్డెంట్ అఫ్ పోలీస్ ఉమాపతి జాంవలీ వెల్లడించారు.

Next Story