ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని త‌ప్పుప‌ట్టిన‌ కూతురు శర్మిష్ఠ

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని త‌ప్పుప‌ట్టిన‌ కూతురు శర్మిష్ఠ
x
Highlights

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై విమర్శలు కొనసాగుతున్నాయి. స్వయంగా ప్రణబ్ కుమార్తె...

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై విమర్శలు కొనసాగుతున్నాయి. స్వయంగా ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తన తండ్రిని తప్పుబట్టారు. ఆర్‌ఎస్ఎస‌ ఆఫీసుకు వెళ్లాలన్న ఆయన నిర్ణయంతో తాను విభేదిస్తున్నట్లు శర్మిష్ట తెలిపారు. ఈ పర్యటన తాలుకా దృశ్యాలే చివరకు మిగులుతాయని ఆమె ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రణబ్ ముఖర్జీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆర్‌ఎస్ఎస‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఇవాళ‌ నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న సంఘ్ శిక్షావర్గ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ప్రణబ్ అంగీకరించడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అదే సమయంలో ఆయన కూతురు శర్మిష్ఠ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ నిర్ణయంపై బుధవారం ట్విట్టర్‌లో స్పందించిన శర్మిష్ఠ.. ఏం మాట్లాడామన్నది అందరూ మరిచిపోతారు. దృశ్యాలు మాత్రమే గుర్తుండిపోతాయి. ఆ సమావేశంలో ప్రసంగించడం అంటే.. తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు పూర్తిగా అవకాశమిచ్చినట్లే అని ఆమె పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను కట్టుకథల ప్రచార సంస్థగా శర్మిష్ఠ అభివర్ణించారు. పర్యవసానాల గురించి ఆలోచించాకే సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? అని తండ్రి ప్రణబ్‌ను ఆమె ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె ఇలాంటి దుష్ప్రచారాలు కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పనేనని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories