సీఎం చంద్రబాబుకు సొంత జిల్లాలో ఝలక్..!

Highlights

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. కిందటినెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి...

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. కిందటినెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.. అయితే టీడీపీలో చేరేంత వరకు కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరుతారనే చర్చ జిల్లాలో ఊపందుకోగా.. అనూహ్యంగా అయన టీడీపీలో చేరారు.. కాగా నల్లారి కుటుంబసభ్యుల చేరికను వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.. దాంతో అయన టీడీపీలో జాయిన్ అయ్యారని అప్పట్లో చర్చ జరిగింది.. ఇటు జిల్లాలో టీడీపీని దెబ్బకు దెబ్బ తీయాలన్నట్టు మాజీ ఎంఎల్ఏ, మాజీ జడ్పి ఛైర్మన్ జివి శ్రీనాధరెడ్డి ఇంటికి స్వయంగా రామచంద్ర రెడ్డి వెళ్ళారు. శ్రీనాధరెడ్డి ఇంటికి పెద్దిరెడ్డి ఎందుకు వెళ్ళారన్నది బహిరంగ రహస్యమే. అయినా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది..

జిల్లాలో టిడిపి-వైసిపిలు ఒకదాన్ని మించి మరోటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. అందులో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టిడిపిలోకి చేర్చుకున్నారు. దశాబ్దాలుగా పీలేరు నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న నల్లారి కుటుంబంకు జిల్లాలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే, కానీ ఊహించని విధంగా గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో నల్లారి కుటుంభం ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఇక కిషోర్ టిడిపిలో చేరిన దగ్గర నుండి జివి కుంటుంబం, బంధుగణంతో పాటు మద్దతుదారులు చంద్రబాబుపై మండిపడుతున్నారట. దీనికి కారణం కూడా లేకపోలేదు, కిషోర్ చేరిక విషయంలో చంద్రబాబు మాటమాత్రంగా కూడా జీవి శ్రీనాధరెడ్డితో ప్రస్తావించలేదట. దాంతో అప్పటి నుండి జీవి, అయన మద్దతుదారులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.. ఇదిలావుంటే శ్రీనాధరెడ్డి టీడీపీకి రివర్స్ పంచ్ ఇచ్చి వైసీపీలో చేరతారో లేక టీడీపీలోలోనే కొనసాగుతారో చూడాలంటె మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories