logo
సినిమా

తార‌క్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే

తార‌క్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే
X
Highlights

'టెంప‌ర్' నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. 'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో',...

'టెంప‌ర్' నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. 'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్‌'.. తాజాగా 'జైల‌వ‌కుశ'.. ఇలా నాలుగు వ‌రుస చిత్రాలు ఆయ‌నకు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా న‌టుడిగా మంచి పేరుని కూడా తీసుకువ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. 'జైల‌వ‌కుశ' విజ‌యంతో తార‌క్‌కి ఉన్న ఓ సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. అదేమిటంటే.. సెప్టెంబ‌ర్‌లో తార‌క్ సినిమాలు బాగా ఆడ‌తాయ‌న్న‌దే ఆ సెంటిమెంట్‌. ఎన్టీఆర్ తొలి హిట్ చిత్రం 'స్టూడెంట్ నెం.1', గ‌తేడాది విడుద‌లైన 'జ‌న‌తా గ్యారేజ్‌', ఇప్పుడు 'జైల‌వ‌కుశ'.. సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై విజ‌యం సాధించాయి. మున్ముందు కూడా తార‌క్‌కి సెప్టెంబ‌ర్ క‌లిసి వ‌స్తుందేమో చూడాలి.

Next Story