మన్యంలో ఆపరేషన్ సమాధాన్!! హై అలర్ట్‌ ఎవరికి?

మన్యంలో ఆపరేషన్ సమాధాన్!! హై అలర్ట్‌ ఎవరికి?
x
Highlights

పచ్చని కొండాకోనల్లో.. ప్రకృతి ఒడిలో ఉండే విశాఖ జిల్లాలో... ఏజెన్సీ మాత్రం రక్తపు మరకలతో ఎర్రబడుతుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న...

పచ్చని కొండాకోనల్లో.. ప్రకృతి ఒడిలో ఉండే విశాఖ జిల్లాలో... ఏజెన్సీ మాత్రం రక్తపు మరకలతో ఎర్రబడుతుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ ప్రాణాలను హరించివేస్తోంది. ప్రశాంత వాతావరణంలో... తుపాకీ తూటాలు, బూట్ల చప్పుళ్లు ఆదివాసీలను హడలెత్తిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల జంట హత్యల తర్వాత... మావోలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వ రంగం వ్యూహాలతో సిద్ధమవుతోంది.

ఏవోబి బోర్డర్ అనగానే మావోల ప్రభావిత ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. అయితే రేండేళ్ల క్రితం ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. అప్పటి నుండి మావోలు అప్పుడప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సరిహాద్దుల్లో చత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌, ఒడిషా ప్రాంతాల్లో మావోయిస్టుల తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.

గత ఏడాది సుక్మ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం మావోయిస్టుల నియంత్రణ పై ఆపరేషన్ సమాధాన్ పేరుతో వ్యూహాలను సిద్దం చేసింది. అప్పటి నుండి బారిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తుంది. ఈ నేపద్యంలో మావోలు కొంతకాలంగా స్థబ్దత గా వున్నారు. దీంతో పోలిసులు రిలాక్స్ అయ్యారు. కరెక్టర్ గా అదే అదునుగా భావించిన మావోలు తమ ఉనికిని చాటే ప్రయత్నం చేసారు. పక్కా సమాచారం తో ప్రజాప్రతినిధుల పై అటాక్ చేసారు.

ిిఇటీవల ఏవోబి లో మావోల అలజడి పెరగడంతో పాటు భారీ రిక్రూట్మెంట్ లు జరుగుతున్నాయన్న సమాచారం కూడా పోలిసులు వద్ద వుంది. అయినా పోలిసులు నిర్లిప్తత మావోల విధ్వంసంకు కిడారి, సోమ ప్రాణాలు బలిగొన్నాయి. నిఘా వ్యవస్థ నిద్రవుతుంది అనడానికి ఉదహరణలుగా ఈ ఘటనలు మిగిలాయి. మన్యం లో మావోల కదలికలు పెరుగుతున్నయన్న సమాచారం వున్నా పోలిస్ వ్యవస్థ అలర్ట్ కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారుతుంది. ఒకే సారి 50 మందికి పైగా మావోలు పట్టపగలు ప్రజాప్రతినిధుల పై దాడికి తెగబడి హతమార్చడం పోలిసుల వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది.

ప్రస్తుతం మావోయిస్టుల హిట్ లిస్ట్ లో మరో 15 మంది ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ముఖ్యంగా రహదారుల శాఖమంత్రి అయ్యనపాత్రుడు, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు, పాడేరు ఏమ్మేల్యే గిడ్డి ఈ శ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరి పై గతకొంతకాలంగా మావోలు ప్రతికార చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ ఘటన తరువాత వీరికి భద్రత ను మరింత పెంచారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎవరూ బయటకు వెళ్లరాదని పోలిసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఏవోబీ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, సీలేరు, చింతపల్లి, నర్శీపట్నం ప్రాంతాల తో పాటు ఏవోబి బోర్డర్, చత్తీస్ ఘడ్ లలో పోలిసుల నిఘా ను పెంచారు. మావోల కు పోలిసులకు మధ్య జరుగుతున్న యుద్దం మన్యం ప్రాంతం ను గెరిల్లా వార్ జోన్ ను తలపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఆపరేషన్ లో మావోలు, పోలిసలు కు మధ్య అమాయక గిరిజనం నలిగిపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం.

Show Full Article
Print Article
Next Story
More Stories