కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై వింత ఆచారం..

Highlights

సాధారణంగా ఎక్కడైన తేలు కనిపిస్తే చాలు కుడుతుందేమో అన్న భయంతో కొట్టి చంపుతాం. కాని కర్నూలు జిల్లాలో మాత్రం అవే తేళ్లను పెంచుకుంటున్నారు అక్కడి...

సాధారణంగా ఎక్కడైన తేలు కనిపిస్తే చాలు కుడుతుందేమో అన్న భయంతో కొట్టి చంపుతాం. కాని కర్నూలు జిల్లాలో మాత్రం అవే తేళ్లను పెంచుకుంటున్నారు అక్కడి స్థానికులు. పిల్లలు సైతం వాటితో ఆడుకుంటున్నారు. భక్తులు వీటితో దేవుడిని ఆలంకరించి తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. ఈ తంతు కోడుమూరులో ఏటా సాగుతోంది.

కోడుమూరులో కొండపై వెలసిన కొండల రాయుడికి శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు తేళ్లతో అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ కొండపై ఏ రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తాయి. వీటిని భక్తులు పట్టుకొని తమ కోర్కెలు తీర్చుమంటూ దారంతో కట్టి స్వామిపై అలంకరిస్తారు. అలా చేయడం వలన తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.

స్వామి మహిమ వల్లే తేళ్లు పట్టుకున్నా కుట్టవని భక్తులు నమ్ముతారు. ఒక వేళ కుట్టినా దేవుడి చుట్టూ మూడు మార్లు తిరిగితే నొప్పి తగ్గుతుందని అంటారు. పిల్లలు సైతం వీటితో ఆడుకున్నా ఎటువంటి హాని చేయకపోవడం విశేషం. మహిళలు తమ పిల్లలతో కలిసి కొండపైకి ఎక్కి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories