కేరళ ప్రభుత్వానికి షాక్.. 50 లక్షలు అతనికి చెలించండి : సుప్రీం కోర్టు

1994నాటి గూఢచర్యం కేసులో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ అరెస్టుకు సంబంధించిన కేసులో కేరళ పోలీసులు...
1994నాటి గూఢచర్యం కేసులో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ అరెస్టుకు సంబంధించిన కేసులో కేరళ పోలీసులు వ్యవరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాక చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంది. దాంతో ఆయనకు అనుకూలంగా తీర్పు చెబుతూ.. అతనికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తం ఎనిమిది వారాల్లోనే ఇవ్వాలని ఆదేశించింది. అసలు వివరాల్లోకి వెళితే. భారత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్మేశారని 1994లో నారాయణన్‌తోపాటు మరో శాస్త్రవేత్త శశికుమారన్ లపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళలో ఉంటున్న మహిళ మరియం రషీదా, మరో ముగ్గురికి నారాయణన్ ఈ సమాచారాన్ని ఇచ్చారని కేరళ పోలీసులు అభియోగం మోపారు.
ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించింది ప్రభుత్వం. అందులో రహస్యాలు ఇతరులకు చేరవేత వంటి అంశాలు ఏవి రుజువు కాకపోవడం,అసలు నారాయణన్ ఏ తప్పూ చేయలేదని వెల్లడైంది. ఆ సమయంలో దాదాపు రెండు నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. అయితే తనను అక్రమంగా అరెస్టు చేసిన కేసుకు బాధ్యులైన నాటి పొలిసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తను దాఖలు పిటిషన్ ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో నారాయణన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. అయన అరెస్ట్ అక్రమమని, ఆలా వ్యవహరించినందుకు, అతను ఇబ్బందిపడ్డందుకు గాను నష్ట పరిహారంగా 50 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా కేరళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకుని ఎనిమిది వారాల్లోగా డబ్బు చెల్లించాలని అందులో పేర్కొంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT