ఎస్‌బీఐ అకౌంట్లో ఎవరెవరు ఎంతెంత మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్ చెయ్యాలంటే..

ఎస్‌బీఐ అకౌంట్లో ఎవరెవరు ఎంతెంత మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్ చెయ్యాలంటే..
x
Highlights

వినియోదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న కారణంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.5 వేల కోట్ల మేర జరిమానాను విధించిందన్న...

వినియోదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న కారణంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.5 వేల కోట్ల మేర జరిమానాను విధించిందన్న వార్తలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ వార్తపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కనీసం బ్యాలెన్స్‌ల మెయింటైన్ 40 శాతం తగ్గించామని.. అంతేకాకుండా 40 శాతం సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని తెలిపింది. వివిధ బ్యాంకులతో పోలిస్తే కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, తమవే తక్కువని చెప్పింది. ఎస్‌బీఐ కొన్ని నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను విభజించి. వాటి ఆధారంగా ఎంతెంత నిల్వ ఉండాలో ఫిక్స్ చేసినట్టు తెలిపింది. రూరల్‌, సెమీ-అర్బన్‌, అర్బన్‌, మెట్రో బ్రాంచ్ ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్‌ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్‌ ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో జరిమానా వినందించే అవకాశముందని తెలిపింది.

ఎస్‌బీఐ బ్రాంచ్‌ టైప్‌ సగటు నెలవారీ నిల్వలు
మెట్రో రూ.3000
అర్బన్‌ రూ.3000
సెమీ-అర్బన్‌ రూ.2000
రూరల్‌ రూ.1000

Show Full Article
Print Article
Next Story
More Stories