కస్టమర్లకు శుభవార్త అందించిన ఎస్‌బీఐ

కస్టమర్లకు శుభవార్త అందించిన ఎస్‌బీఐ
x
Highlights

ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఇప్పుడున్న వడ్డీ రేట్లను సమీక్షించి స్వల్పంగా పెంచుతూ.....

ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఇప్పుడున్న వడ్డీ రేట్లను సమీక్షించి స్వల్పంగా పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. అదికూడ సంవత్సరం నుంచి పదేళ్ల కాలపరిమితి ఉన్నఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది. జూలై 30వ తేదీ నుంచే పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దాంతో సంవత్సరం తరువాత నుంచి పదేళ్ల కాల పరమితిలో డిపాజిట్ చేసిన సొమ్ముకి వడ్డీ పెరగనున్నాయి. పెంచిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఏడాది నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితిపై 6.65 నుంచి 6.7శాతం, రెండు నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 6.65 నుంచి 6.75శాతం, మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 6.7 నుంచి 6.8శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 6.75 నుంచి 6.85శాతానికి పెంచినట్టు ఎస్‌బీఐ తెలిపింది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లను సమీక్షించిన ఎస్‌బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.2శాతానికి పెంచింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.25 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 7.2 నుంచి 7.3 శాతం . ఇక ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు డిపాజిట్లపై 7.25 నుంచి 7.35శాతానికి వడ్డీ పెంచినట్టు ఎస్‌బీఐ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories