రేపటినుంచి వారికీ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవు

రేపటినుంచి వారికీ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవు
x
Highlights

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వాడుతున్న ప్రతియొక్క SBI వినియోగదారుడు.. మరోసారి తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించుకోవాలి. లేదంటే రేపటినుంచి ఇంటర్నెట్...

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వాడుతున్న ప్రతియొక్క SBI వినియోగదారుడు.. మరోసారి తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించుకోవాలి. లేదంటే రేపటినుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని గత నెలరోజుల కిందట sbi వెల్లడించింది. కాగా sbi విధించిన గడువు ఈ రోజు అర్ధర్రాతిరితో ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే తప్పనిసరిగా ఖాతాకు మొబైల్ నెంబర్ ను అనుసంధానం చెయ్యాలి. sbi ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు మొబైల్ నెంబర్ ను అనుసంధానం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవాలి.

*ముందుగా మీ యూజర్ నేమ్ , పాస్వర్డ్ తో sbi online లో లాగిన్ అవ్వాలి.
* తర్వాత.. ‘మై అకౌంట్‌ అండ్‌ ఫ్రొఫైల్‌’ టాబ్‌పై క్లిక్‌ చేయాలి.
* మై అకౌంట్‌ అండ్‌ ప్రొఫైల్‌’ టాబ్‌లో ‘ప్రొఫైల్‌’పై క్లిక్‌ చెయ్యాలి. అందులో ‘పర్సనల్‌ డిటైల్స్‌/మొబైల్‌ టాబ్‌పై క్లిక్‌ చేయాలి.
* అక్కడ మీ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ ను ఎంటర్ చేసి అందులోకి వెళితే.. మీ మొబైల్‌ నంబరు, ఇమెయిల్‌ ఐడీ ఉంటే కనిపిస్తాయి.
*మీ మొబైల్‌ నంబరు అక్కడ కనిపించకపోతే.. మీకు రేపటినుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories