SBI వినియోగదారులకు హెచ్చరిక.. అందరూ మొబైల్ నంబర్..

SBI వినియోగదారులకు హెచ్చరిక.. అందరూ మొబైల్ నంబర్..
x
Highlights

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్ సేవలపై ప్రకటన చేసింది. డిసెంబరు 1లోగా మీ మొబైల్‌ నంబరును బ్యాంకు వద్ద...

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్ సేవలపై ప్రకటన చేసింది. డిసెంబరు 1లోగా మీ మొబైల్‌ నంబరును బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలని.. లేకుంటే డిసెంబర్ 1నుంచి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం నిలిపివేస్తామ’ని పేర్కొంది. వినియోగదారులు తమ ఖాతాకు మొబైల్‌ నంబరు అనుసంధానం అయి ఉండకపోతే దగ్గరలోని sbi శాఖా ద్వారా అనుసంధానం చేసుకోవాలన్న విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
ముందుగా

* వినియోగదారులు ‌www.onlinesbi.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలతో లాగిన్‌ చెయ్యాలి.
* తర్వాత.. హోమ్‌పేజీపై ఉన్న ‘మై అకౌంట్‌ అండ్‌ ఫ్రొఫైల్‌’ టాబ్‌పై క్లిక్‌ చేయండి.
* ‘మై అకౌంట్‌ అండ్‌ ప్రొఫైల్‌’ టాబ్‌లో ‘ప్రొఫైల్‌’పై క్లిక్‌ చేయండి. అందులో ‘పర్సనల్‌ డిటైల్స్‌/మొబైల్‌’ టాబ్‌పై క్లిక్‌ చేయాలి.
* అక్కడ మీ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ ను ఎంటర్ చేసి అందులోకి వెళితే.. మీ మొబైల్‌ నంబరు, ఇమెయిల్‌ ఐడీ(ఒకవేళ మీరు నమోదు చేసి ఉంటే) కనిపిస్తాయి.
* అక్కడ మీ మొబైల్‌ నంబరు అక్కడ కనిపించకపోతే.. మీ శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. లేదంటే డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం మీకు అందుబాటులో ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories