సౌదీ అరేబియాలో 11 మంది యువరాజుల అరెస్టు

Highlights

సౌదీ అరేబియా సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. సంస్కరణల్లో భాగంగా సౌదీ యువరాజు సంచనల నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వంలో ఉన్న...

సౌదీ అరేబియా సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. సంస్కరణల్లో భాగంగా సౌదీ యువరాజు సంచనల నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వంలో ఉన్న మంత్రులతోపాటు దేశంలోనే అత్యంత సంపనున్నడైన తలాల్ తో పాటు 11 మంది యువరాజులు కూడా ఉన్నారు. సౌదీ అరేబియాలో యువరాజులు, మంత్రులతో పాటు పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. రాయల్‌ డిక్రీ ద్వారా క్రౌన్‌ ప్రిన్స్‌ మహమూద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలో అవినీతి వ్యతిరేక కమిషన్‌ ఏర్పాటైన కొద్దిసేపటికే ఈ అరెస్టులు జరిగాయి.

సౌదీ నేషనల్‌ గార్డ్‌ అధిపతి, నేవీ చీఫ్, ఆర్థిక మంత్రిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించడం సంచలనం సృష్టించింది. సౌదీలో చమురు శకం తర్వాత ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రిన్స్‌ సల్మాన్‌ తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసినట్లు సౌదీ అధికారిక మీడియా వెల్లడించింది.

2009 నాటి పాత కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్టు తెలిపింది. అవినీతి వ్యతిరేక కమిషన్‌ లక్ష్యం ప్రజా ధనాన్ని కాపాడటం.. అవినీతికి పాల్పడే వారిని.. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని శిక్షించడం.. అని సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ చర్యతో ఇప్పుడు సౌదీ సర్కార్ మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్తీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌదీ రాజు రాచకుటుంబంలో తన స్థానాన్ని , ఆధిపత్యాన్ని సుస్థిరపరచుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories