logo
సినిమా

హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం

హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం
X
Highlights

హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం ఎదురైంది. హైద‌రాబాద్ లోని హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాప్...

హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం ఎదురైంది. హైద‌రాబాద్ లోని హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి వ‌చ్చిన ఆమెపై ఓ దుండ‌గుడు చెప్పుతో దాడి చేశాడు. జ్యువెల‌రీ మాల్ ప్రారంభిస్తుండ‌గా కొద్ది దూరంలో ఉన్న ఆ దుండ‌గుడు చెప్పు విసిరాడు.
అయితే, అతను విసిరిన బూటు, ఆమెకు కొంత దూరంలో పడింది.దీంతో, అతనిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, తమన్నాపై షూ విసిరిన వ్యక్తి పేరు కరీముల్లా అని సమాచారం.

Next Story