వీఆర్ఏను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా..

x
Highlights

కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ సాయిలును ట్రాక్టర్‌తో తొక్కించేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి...

కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ సాయిలును ట్రాక్టర్‌తో తొక్కించేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పిట్లం మండలం కారెగాంలో ఈ దారుణ ఘటన జరిగింది. వీఆర్ఏ సాయిలు మృతితో బంధువులు ఆందోళనకు దిగారు. ఇసుకు మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంబాపూర్‌లోని కాకివాగు నుంచి కొన్ని రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఇది తెలిసిన వీఆర్ఏ సాయిలు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ ఇసుకాసురులు రెచ్చిపోయారు. వెంటనే అతనిపైకి ట్రాక్టర్ ఎక్కించేశారు.

కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత సాయిలు ఘటనాస్థలికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆయన చనిపోయిన విషయం తెలుసుకొని కారెగాం, మార్తాండ గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయనడానికి ఈ ఘటన మరోసారి ఉదాహరణగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories