చోరీ కేసులో నటుడు సామ్రాట్‌రెడ్డి అరెస్ట్

చోరీ కేసులో నటుడు సామ్రాట్‌రెడ్డి అరెస్ట్
x
Highlights

సినీనటుడు సామ్రాట్‌రెడ్డిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్లో చోరీ కేసు నమోదైంది. తాను ఇంట్లో లేనప్పుడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బంగారం తీసుకెళ్లాడని...

సినీనటుడు సామ్రాట్‌రెడ్డిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్లో చోరీ కేసు నమోదైంది. తాను ఇంట్లో లేనప్పుడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బంగారం తీసుకెళ్లాడని సామ్రాట్‌రెడ్డి భార్య హర్షితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్ పోలీసులు సామ్రాట్‌రెడ్డిపై 448, 427, 380, 454, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామ్రాట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మియాపూర్‌ కోర్టులో హాజరు పర్చారు.

సామ్రాట్‌రెడ్డి, భార్య హర్షితారెడ్డి మధ్య గొడవల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. గతంలో రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌లో భర్త వేధింపులపై హర్షితారెడ్డి ఫిర్యాదు చేసింది. అప్పట్లో 498ఏ, 323, 307,420, 406 సెక్షన్ల కింద సామ్రాట్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసు నడుస్తుండగానే.. తాను ఇంట్లో లేని సమయంలో చొరబడి బంగారం అపహరించినట్టు భార్య ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories