ఏనిమిదేళ్ల ప్రేమకి థ్యాంక్స్

సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ...
సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. తన భర్త చైతన్యతో కలిసి న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో సెల్ఫీ దిగిన ఆమె అభిమానులకు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాకు సెల్ఫీలు దిగడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దిగాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ పార్క్‌లోనే 8 ఏళ్ల క్రితం మా మధ్య ప్రేమ మొదలైంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని మా నమ్మకం. అందుకే ఈ ప్లేసుకు థాంక్స్ చెప్పుకోవడానికే తిరిగి ఇక్కడకు వచ్చాము... అని సమంత తెలిపారు.
సమంత, చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' మూవీ చిత్రీకరణ 8 ఏళ్ల క్రితం న్యూయార్కులోని సెంట్రల్ పార్కులో జరిగింది. ఇక్కడ వీరి మధ్య పలు ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారింది. గతేడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
యూఎస్ఏలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అనంతరం ఈ జంట ఏప్రిల్ 6న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీ కానున్నారు. సమంత తమిళ చిత్రాలైన సీమరాజా, సూపర్ డిలక్స్, తెలుగు మూవీ 'యూటర్న్' చిత్రాల షూటింగుల్లో జాయిన్ అవుతారు. నాగ చైతన్య ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు. పెళ్లయిన తర్వాత సమంత, చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి చేయబోతున్నారు. ఈ చిత్రానికి కంబైన్డ్ రెమ్యూనరేషన్ రూ. 7 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
ప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMT26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMT