logo
సినిమా

సినిమాలకు సమంత గుడ్‌ బై!

సినిమాలకు సమంత గుడ్‌ బై!
X
Highlights

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు...

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌. అయితే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ప్ర‌క‌టించిన ఆమె రానున్న రోజుల‌లో సినిమాల‌కి నిజంగానే గుడ్ బై చెబుతుందా అని హాట్ హాట్ చర్చ‌లు జ‌రుపుతున్నారు అభిమానులు. పిల్ల‌ల కోస‌మే స‌మంత ఈ నిర్ణ‌యం తీసుకుందా అంటే.. అప్ప‌ట్లో తాము పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు అని చెప్పింది . పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం అని సామ్‌ తెలిపింది. మ‌రి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంపై స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story