logo
సినిమా

స‌మంత‌.. ఆరు సినిమాల తర్వాత‌

స‌మంత‌.. ఆరు సినిమాల తర్వాత‌
X
Highlights

క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మై ఏడేళ్ల‌యినా.. సమంత‌కున్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తెలుగునాట నెం.1 హీరోయిన్‌గా...

క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మై ఏడేళ్ల‌యినా.. సమంత‌కున్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తెలుగునాట నెం.1 హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, త‌మిళ చిత్రాల‌తో క‌లుపుకుని మొత్తం ఏడు సినిమాల‌తో బిజీగా ఉందిప్పుడు. ఇదిలా ఉంటే.. త‌న కెరీర్ ప్రారంభంలో సోలో హీరోయిన్‌గానే ఎక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ గ‌త మూడేళ్లుగా ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది.

స‌మంత సోలో హీరోయిన్ గా న‌టించిన చివ‌రి తెలుగు చిత్రం మూడేళ్ల క్రితం వచ్చిన 'అల్లుడు శీను'నే. ఆ సినిమా త‌రువాత ఆమె చేసిన 'ర‌భ‌స‌', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి', 'బ్ర‌హ్మోత్స‌వం', 'అఆ', 'జ‌న‌తా గ్యారేజ్' చిత్రాలు మ‌ల్టీ హీరోయిన్ స‌బ్జెక్ట్‌ల‌తో రూపొందిన‌వే. ఇక దీపావ‌ళికి రానున్న 'రాజు గారి గ‌ది2'లోనూ స‌మంత‌తో పాటు సీర‌త్ క‌పూర్ న‌టిస్తోంది. అయితే రామ్ చ‌ర‌ణ్ తో తొలిసారిగా న‌టిస్తున్న 'రంగ‌స్థలం'లో మాత్రం ఆమెది సోలో హీరోయిన్ వేషం. మొత్తానికి.. ఆరు సినిమాల త‌ర్వాత స‌మంత‌కి సోలో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌న్న‌మాట‌.

Next Story