logo
సినిమా

ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారంటే..

ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారంటే..
X
Highlights

ఏటా విడుదలయ్యే ఫోర్బ్స్‌ జాబితా ఈ ఏడాది కూడా విడుదల అయింది. ఇందులో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన...

ఏటా విడుదలయ్యే ఫోర్బ్స్‌ జాబితా ఈ ఏడాది కూడా విడుదల అయింది. ఇందులో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన వందమంది సెలబ్రిటీలు ఎంతెంత సంపాదిస్తున్నారో పేర్కొంది. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్‌ ఈ ఏడాది 13వ స్థానంలో ఉన్నారు. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు. ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ లో సల్మాన్‌ ఖాన్‌ మొదటి స్థానంలో నిలిచారు. విశేషమేమంటే వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్ ను దక్కించుకున్నారు సల్మాన్‌.. మొత్తం 253 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్‌ పేర్కొంది. అలాగే మూడో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ (185 కోట్లు) ఉన్నారు. 112.8 కోట్లతో దీపికా పదుకోన్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్‌లో నిలిచారు. సౌత్ ఇండియాలో టాప్‌ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ 24వ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత 28 కోట్లు సంపాదనతో జూనియర్ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచాడు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) ఉన్నారు. ఇక వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న సంచలన దర్శకుడు కొరటాల శివ 20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ (15.67 కోట్లు)తో 64 వ స్థానం, 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్‌. సౌత్‌ ఇండియా నుంచి హీరోయిన్స్‌లో నయనతార మాత్రమే ఫోర్బ్స్‌ లిస్ట్‌లో నిలవడం విశేషం. రామ్‌చరణ్‌ (14 కోట్లు)తో72వ స్థానం. అర్జున్ రెడ్డి, గీతగోవిందం విజయాలతో రేసులోకొచ్చిన విజయ్‌ దేవరకొండ (14 కోట్లు) తో 72 వ స్థానంలో ఉన్నారు.

Next Story