తనకి దొరికిన అమ్మాయి ఎవరో చెప్పిన సల్మాన్

యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన...
యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. 'నాకు ఒక అమ్మాయి దొరికింది' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనా? అనే ఆసక్తి ఇప్పుడు అందర్లో నెలకొంది. కొంత కాలంగా లులియా వాంటూర్ తో సన్నిహితంగా ఉంటున్న సల్మాన్ ఇటీవల ఆమెకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి. లులియా కూడా సల్మాన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ కామెంట్ చేయటంతో వారిద్దరు దూరమయ్యారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు సల్మాన్ ట్వీట్ తో మరోసారి సల్మాన్ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో అందరి అనుమానాలని పటాపంచలు చేస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. తనకి దొరికిన అమ్మాయి సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ లో రూపొందబోయే లవ్ రాత్రి సినిమా కథానాయిక వరీనా అని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. ఆయుశ్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లవ్ రాత్రి చిత్రం అభిరాజ్ మినవాల్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇక ఇటీవల టైగర్ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం రేస్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Nothing to worry na @aaysharma ki film #Loveratri ke liye ladki mil gayi Warina, Toh dont worry na be happy na pic.twitter.com/uetTpUKRdi
— Salman Khan (@BeingSalmanKhan) February 6, 2018
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT