logo
జాతీయం

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కొత్త కష్టాలు

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కొత్త కష్టాలు
X
Highlights

జైపూర్‌లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం టైగర్ జిందా హై ప్రదర్శిస్తున్న థియేటర్‌పై కొందరు దాడి చేశారు. టైగర్‌...

జైపూర్‌లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం టైగర్ జిందా హై ప్రదర్శిస్తున్న థియేటర్‌పై కొందరు దాడి చేశారు. టైగర్‌ జిందా హై సినిమా పదర్శితమవుతున్న రాజమందిర్‌ థియేటర్‌పైకి ఎక్కి భారీ ఫ్లెక్సీలను చింపి, తగులబెట్టారు. సల్మాన్ ఖాన్, శిల్పా షెట్టి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. సల్మాన్‌ఖాన్, శిల్పాశెట్టి ఓ టీవీ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలపై దుమారం లేస్తుంది.

ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో కత్రినా కైఫ్‌తో కలిసి పాల్గొన్న సల్మాన్‌ఖాన్ భంగి అనే కులస్థులను కించపరుస్తూ మాట్లాడారు. స్టెప్పులు వేయడంలో తన అసమర్థతను భంగితో పోల్చారు. ఈ స్టెప్ చేస్తే భంగి మాదిరిగా కనిపిస్తానంటూ వ్యాఖ్యానించారు. సల్మాన్‌ వ్యాఖ్యలపై భంగి వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సల్మాన్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story