Top
logo

సాక్షి సింగ్‌.. ధోనికి కాస్త మర్యాదివ్వు.!

సాక్షి సింగ్‌.. ధోనికి కాస్త మర్యాదివ్వు.!
X
Highlights

మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ దోని తన భార్య సాక్షితో కలిసి షాపింగ్ వెళ్లి అక్కడ సాక్షికి దోని చెప్పులు తొడగటం ...

మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ దోని తన భార్య సాక్షితో కలిసి షాపింగ్ వెళ్లి అక్కడ సాక్షికి దోని చెప్పులు తొడగటం సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ ఫోటోను కాస్తా దోని భార్య సోషల్ మీడియాలో పెట్టింది. కాగా దోని చెప్పులు నువ్వే కొనిచ్చావ్ కాబట్టి నువ్వే తొడగాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ పోస్టుపై దోని అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మా దేవుడు ధోనీతోనే చెప్పులు తొడిగించుకుంటావా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు అభిమానులు. ఇక మరికొందరైతే ధోనీ నీవు కెప్టెన్ వి సర్వెంట్ వి కాదు అంటూ స్పందించారు. బక్వాస్ పిక్ అని ఇంకొకరు సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దీనికి సాక్షి మరో ఫొటోతో స్పందించింది. ఈసారి ధోనీ తనకు బ్రేస్‌లెట్ తొడుగుతున్న ఫొటో పెట్టి ఇది నువ్వే ఇప్పించావు నువ్వే తొడగాలి అంటూ అలాగే మరో క్యాప్షన్ పెట్టింది.

Next Story