సింధుపై సైనా విజయం

సింధుపై సైనా విజయం
x
Highlights

ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌.. తన దేశానికే చెందిన మూడో ర్యాంక్‌ ప్లేయర్‌ పీవీ సింధుపై...

ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌.. తన దేశానికే చెందిన మూడో ర్యాంక్‌ ప్లేయర్‌ పీవీ సింధుపై ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా 21-13, 21-19 తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో శ్రమించాల్సి వచ్చింది. చివరకు తన అనుభవాన్ని ఉపయోగించిన సైనా రెండో గేమ్‌ను గెలవడంతో పాటు సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

37 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి సైనాదే పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సైనా అదే జోరుతో రెండో గేమ్‌ను ఆరంభించింది. మధ్యమధ్యలో మాత్రమే సింధు నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న సైనా 21-19తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో విజయం సాధించిన సైనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సైనా-సింధు ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికపై మూడు సార్లు తలపడగా రెండుసార్లు సైనా విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories