logo
సినిమా

తెర‌పైకి స‌చిన్ కూతురు

తెర‌పైకి స‌చిన్ కూతురు
X
Highlights

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గా క్రికెట్ రంగంలో పేరు తెచ్చుకున్నారు స‌చిన్ టెండూల్క‌ర్‌. ఈ ఏడాది ఆయ‌న 'స‌చిన్ - ఎ...

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గా క్రికెట్ రంగంలో పేరు తెచ్చుకున్నారు స‌చిన్ టెండూల్క‌ర్‌. ఈ ఏడాది ఆయ‌న 'స‌చిన్ - ఎ బిలియ‌న్ డ్రీమ్స్' పేరుతో డాక్యూమెంట‌రీ బ‌యోపిక్ ఫిల్మ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న కుమార్తె సారా టెండూల్క‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది.

ఇప్పుడు ఆమె ముచ్చ‌ట‌ని.. స‌చిన్‌కి స‌న్నిహితుడైన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ తీర్చ‌బోతున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్‌కానీ, ర‌ణ‌వీర్ సింగ్ కానీ హీరోగా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. సారా ఎంట్రీకి సంబంధించిన అధికారిక స‌మాచారం ఇరువైపుల నుండి అయితే ఇంకా రాలేదు.

ఇదిలా ఉంటే.. అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌', 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాలు చేస్తున్నారు. 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' వ‌చ్చే నెల 19న విడుద‌ల కానుండ‌గా.. 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్' వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Next Story