logo
సినిమా

వరద బాధితుల కోసం ‘ఆర్‌ఎక్స్100’ బైక్

వరద బాధితుల కోసం ‘ఆర్‌ఎక్స్100’ బైక్
X
Highlights

వరద బాధితులకు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుంద‌నేది మరోసారి రుజువైంది. 2014 హుద్...

వరద బాధితులకు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుంద‌నేది మరోసారి రుజువైంది. 2014 హుద్ హుద్ నుండి మొన్నటి చెన్నైవరదల వరకు ఇలాంటి అన్ని సమయాల్లో తెలుగు హీరోలు అండ‌గా నిల‌బ‌డ్డారు. గత పన్నెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేరళ ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్ ఇలా ఒక్కరంటూ కాదు కాస్త స్టార్ డం ఉన్న వారంతా కేరళ కోసం తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆర్‌ఎక్స్100 టీం.. సినిమాలో తాము ఉపయోగించిన బైక్‌ని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలనుకుంటున్నారు. ఇందుకోసం బైక్ బిడ్ వాల్యూ రూ.50,000లుగా నిర్ణయించారు. మీరు ఎంత మొత్తం చెల్లించి బైక్‌ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను [email protected] కి గానీ లేదా 9100445588 నెంబర్‌కి గానీ వాట్సాప్ చేయమంటోంది ఆర్‌ఎక్స్ 100 టీం.

Next Story