logo
ఆంధ్రప్రదేశ్

పల్లె కోయిలకు వెల్లువెత్తిన అభినందనలు

పల్లె కోయిలకు వెల్లువెత్తిన అభినందనలు
X
Highlights

పల్లె కోయిల బేబికి పలువురు సాహితీ, సంగీత ప్రియుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రఖ్యాత సినీ దర్శకులు...

పల్లె కోయిల బేబికి పలువురు సాహితీ, సంగీత ప్రియుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రఖ్యాత సినీ దర్శకులు ఏ.ఆర్.రెహమాన్ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆమెకు తన అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఈ నెల 20న మ్యూజిక్‌ డైరెక్టర్ కోటి పాటల రికార్డింగ్‌కు ఆహ్వానం పలికారు. బేబీ అద్బుత గాత్రం విన్న మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి కూడా రమ్మని ఆహ్వానించారు. దర్శకులు వంశీ, సినీనటులు ఎంపీ మురళీమోహన్ ఆమె ఇంటికి వడిశలేరు వెళ్లి సత్కరించారు. దీనిపై స్పందించిన బేబీ సోషల్‌మీడియా ద్వారా గుర్తించి తనను వెలుగులోకి తెచ్చిన హెచ్‌ఎంటీవీకి కృతజ్ఞతలు తెలిపారు. అవకాశాల కోసం వెతికే వారికి రాని ఛాన్స్ తనకు వచ్చిందని, అది చాలా ఆనందంగా ఉందని చెబుతున్న బేబి వెల్లడించింది.

Next Story