హైదరాబాద్‌ ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు...

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్‌ నుంచి పటాన్‌ చెరు వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు డివైడర్ ను దాటి బస్సును ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటు బస్సు కూడా రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. మృతులంతా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌కు చెందిన వారని తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. బస్సు కూడా ధ్వంసమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories