logo
Editorial

రోహింగ్యా సంక్షోభం

రోహింగ్యా సంక్షోభం
X
Highlights

మయన్మార్‌ రోహింగ్యాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌ సాన్‌ సూకీ పాలనలో...

మయన్మార్‌ రోహింగ్యాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌ సాన్‌ సూకీ పాలనలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో మయన్మార్‌ సైన్యం వారిౖపె విరుచుకుపడి మారణహోమం సృష్టిస్తోంది. ప్రాణభీతితో దేశాల సరిహద్దులు దాటి పరిగెడుతున్నారు. రోహింగ్యా శరణార్థులకు రక్షణ కల్పించమని యూఎన్‌హెచ్‌సీఆర్‌ భారత్‌ను కోరింది. ఆశ్రయం కల్పించమని రోహింగ్యా శరణార్థులు సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై దేశంలో అనుకూల, ప్రతికూల వాదనలు తలెత్తార¬. రోహింగ్యా శరణార్థుల వ్యవహారౖంపె కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ, దేశంలో వీరు పలు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, దేశ భద్రతకు వారు పెనుముప్పుగా పరిణమించారనీ చెప్పడం వివాదాస్పదంగా మారింది. అత్యంత భయానకౖమెన మానవతా సంక్షోభంలో కూరుకుపోయిన రోహింగ్యా శరణార్థులౖపె భారత్‌తో సహా పలు దేశాలు ప్రదర్శిస్తున్న వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మయన్మార్‌లోని రాౖఖెన్‌ రాష్ట్రంలో రాజ్యరహిత మానవ సమూహాలుగా నివసిస్తున్న రోహింగ్యా ప్రజలను 'ఆర్కనీస్‌ ఇండియన్స్‌'గా పిలుస్తారు. వీరిలో మెజారిటీ ప్రజలు ముస్లింలే అయినప్పటికీ వారిలో హిందువులు కూడా మైనారిటీ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత అమానవీయ అణచివేతకు గురవుతున్న జాతుల్లో రోహింగ్యాలను కూడా 2013లో ఐక్యరాజ్య సమితి గుర్తించింది. మయన్మార్‌లో దాదాపు 10 లక్షలకు పైగా ఉన్న రోహింగ్యాలకు ఇప్పటి వరకు ఆ దేశ పౌరసత్వం లేకనే దుర్భర జీవితాల్ని వెళ్లదీస్తున్నారు. ఆ దేశంలోని 1982 చట్టాలు వారికి మయన్మార్‌ జాతీయతను తిరస్కరించాయి. 8 శతాబ్దంలోనే రోహింగ్యా ప్రజలు రాౖఖెన్‌ రాష్ట్రంలో నివసిస్తున్న చారిత్రక ఆధారాలున్నప్పటికీ మయన్మార్‌ ప్రభుత్వం వారిని 8 మైనారిటీ జాతుల్లో ఒకరుగా గుర్తించ నిరాకరించారు. చిట్టగాంగ్‌‌లోని బెంగాలీ యాసతో మాట్లాడుతున్న రోహింగ్యా జాతీయులను బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులుగా మయన్మార్‌ పరిగణిస్తోంది. పర్షియన్‌, అరబ్‌ వ్యాపారస్తులతో వచ్చిన రోహింగ్యాలు మయన్మార్‌లో స్థిరపడిన వలస ప్రజలేగాని, స్థానికులు కాదని ఆ ప్రభుత్వం ప్రకటించింది.

ఏళ్ల తరబడి మయన్మార్‌లో స్థిరపడిన రోహింగ్యాల కదలికలౖపెన ఆంక్షలు, విద్య, పౌర సేవా సంస్థల్లోకి వారి ప్రవేశాన్ని మయన్మార్‌ నిషేధించడం దారుణం. జాతి వివక్షకు గురికావడమే కాకుండా, 1978, 1991-92, 2012, 2015, 2016-17 వివిధ దశల్లో తీవ్ర మారణకాండకు వారు గురయ్యారు. గ్రామాలకు గ్రామాలను తగులబెడుతూ నాజీల స్థాయిలో దారుణ అకృత్యాలకు ఒడిగడుతోంది. భయంకరమైన చిత్రహింసలు అనుభవించిన ఆనవాళ్ళతో ఉన్న శవాలు బంగ్లాదేశ్‌ తీరప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా గత నెల 25న రోహింగ్యా మిలిటెంట్‌ సంస్థ 'రఖినే' దాడుల్లో 12 మంది అ«ధికారులు హతమైనప్పటి నుంచి మయన్మార్‌ సైనిక దమనకాండ మరింత తీవ్ర స్థాయికి చేరింది. పర్యవసానంగా దక్షిణాసియాలో ఎక్కడా లేని విధంగా మానవతా సంక్షోభం తలెత్తింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఉన్నత స్థాయి కమిషన్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ప్రకారం తాజా మారణ కాండ కారణంగా 3 లక్షల మందికి పైగా వలస పోయారు. వారిలో దాదాపు 40వేల మంది భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బౌద్ధం పరిఢవిల్లుతున్న మయన్మార్‌ గడ్డపై నేడు విద్వేష విషం పొంగిపొర్లుతోంది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో మయన్మార్‌ సైన్యం సాగిస్తున్న 'జాతిని తుడిచిపెట్టే' కార్యక్రమౖంపె ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా నిరసనలు వస్తున్నా నోబెల్‌ శాంతి విజేత సూకీ మాత్రం రోహింగ్యాలను ఉగ్రవాదులని ప్రకటించి మిలటరీ అకృత్యాలను సమర్థిస్తుండడంతో మిగిలిన నోబెల్‌ గ్రహీతలు ఆమెను తప్పుపడుతున్నారు.

దక్షిణాసియాలోనే అతి పెద్ద సంఖ్యలో శరాణార్థులను ఆదుకున్న దేశంగా భారత్‌ నిలుస్తుంది. దేశ విభజన సమయంలోను, బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలోను, శ్రీలంకలో ఎల్‌టీటీఈ చేసిన యుద్ధ సమయంలోనూ లక్షల మంది శరణార్థులకు భారత్‌ ఆశ్రయమిచ్చింది. అయితే దురదృష్టమేమంటే శరణార్థులను ఆదుకునేందుకు నిర్ధిష్టౖమెన చట్టం ఇప్పటివరకూ రూపొందించ లేకపోవడం దురదృష్టకరం.

1951 నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందం, 1967 నాటి ప్రొటోకాల్‌ రెండూ కూడా అంతర్జాతీయంగా శరాణార్థుల స్థితిగతుల గురించి, వివిధ దేశాలు వారికి అందించవలసిన సహకారం గురించిన విధి విధానాలను వెల్లడిస్తారు. రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని అంతర్జాతీయ సంస్థలు చేసిన విజ్ఞప్తిని శరణార్థుల ఒప్పందంలో సంతకం చేయకపోవడం అంశం సాకుగా భారత్‌ తోసిపుచ్చింది. అయితే మానవతా సంక్షోభ పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నామా, దేశంలో అలాంటి చట్టాలు ఉన్నాయా అన్నది ప్రామాణికంగా తీసుకొని సవ్యంగా స్పందించకపోవడం అమానవీయమవుతుంది. శరణార్థులతోపాటు ఉగ్రవాదులు ప్రవేశిస్తే దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంగా మానవతాసహాయాన్ని అందించకపోవడం చారిత్రకతప్పిదమవుతుంది.

Next Story