Top
logo

ఏటీఎంలను లూటీ చేసిన దొంగలు

ఏటీఎంలను లూటీ చేసిన దొంగలు
X
Highlights

హైదరాబాద్ లోని చందానగర్‌ మూడు ఏటీఎంలను దొంగలు లూటీ చేశారు. గ్యాస్‌ కట్టర్లతో మెషీన్లను కట్‌ చేసి… 13 లక్షల...

హైదరాబాద్ లోని చందానగర్‌ మూడు ఏటీఎంలను దొంగలు లూటీ చేశారు. గ్యాస్‌ కట్టర్లతో మెషీన్లను కట్‌ చేసి… 13 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్‌ ప్రాంతంలోని ఓ కాంపౌండ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ మూడు ఏటీఎంలను నిర్వహిస్తోంది. అయితే కొంతకాలంగా వీటికి కాపలాగా సెక్యూరిటీ గార్డ్‌లు లేరు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడాన్ని పసిగట్టిన దొంగలు గురువారం అర్ధరాత్రి ముసుగులతో వచ్చారు.. అనంతరం గ్యాస్‌ కట్టర్ల సాయంతో రెండు ఏటీఎంలను ఓపెన్‌ చేసి. వాటిలో ఉన్న 13 లక్షల రూపాయలను దోచుకుని పరారయ్యారు. ఏటీఎంలు చోరీకి గురైనట్లు గుర్తించిన సిబ్బంది.. ఉన్నతాధికారులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు… సీసీటీవి పుటేజీ ఆధారంగా దొంగల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Next Story