Top
logo

ప్రాణాలతో రెండుగంటలు పోరాటం.. చివరకు..

ప్రాణాలతో రెండుగంటలు పోరాటం.. చివరకు..
X
Highlights

వరంగల్‌ జిల్లాలో లారీ కింద చిక్కుకుని ప్రాణాలతో రెండు గంటలు విలవిలలాడుతున్న ఓ యువకుడిని చాకచక్యంగా కాపాడారు...

వరంగల్‌ జిల్లాలో లారీ కింద చిక్కుకుని ప్రాణాలతో రెండు గంటలు విలవిలలాడుతున్న ఓ యువకుడిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద నిన్న బైక్‌పై వెళ్తున్న వెంకన్నను.. భారీ మెషినరీతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించి లారీ క్యాబిన్‌ కింద ఇరుక్కుపోయాడు వెంకన్న. లారీ యాక్సిల్‌ కూడా వంగి పోయి భూమిలోకి కూరుకుపోవడంతో.. బయటకు రాలేకపోయాడు. దాదాపు రెండు గంటల సేపు నరకం అనుభవించాడు. ఈ క్రమంలో వెంకన్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి తరలివచ్చారు. పోలీసులు త్వరితగతిన ఘటనాస్థలికి చేరుకొని.. క్రేన్‌ను రప్పించి.. లారీ క్యాబిన్‌ను పైకి లేపి.. వెంకన్నను కాపాడారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story