logo

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
Highlights

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమరబండ బైపాస్‌ వద్ద ఆగి ఉన్న లారీని...

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమరబండ బైపాస్‌ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ, సౌజన్యలుగా గుర్తించారు..

లైవ్ టీవి

Share it
Top