పండుగకు వస్తూ తిరిగిరానిలోకాలకు..

nanireddy
Updated on: 24 Dec 2018 3:52 PM IST
పండుగకు వస్తూ తిరిగిరానిలోకాలకు..
X

జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.. ఆ కుటుంబంలో మాత్రం విషాదాన్ని నింపింది. పండగ కోసమని వెళుతున్న ఆ కుటుంబంపై మృత్యువు కాటేసింది. నిన్న(మంగళవారం) సిరిసిల్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కరీంనగర్‌ కట్టరాంపూర్‌ కు చెందిన అనిల్‌(43), భార్య గీత, కుమారులు సూరజ్‌ (17), సృజ న్‌ (15)లతో కలసి సిరిసిల్లకు తన కారులో బయలుదేరారు. బుధవారం అత్తగారింట్లో నిర్వహించే దీపావళి వేడుకలకు వీరు హాజరు కావాల్సి ఉంది. అయితే కారు సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే.. సిద్దిపేట నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ ఎదురుగా వచ్చింది. అప్పటికే వేగంగా ఉన్న కారు.. అదుపుతప్పి కంటెయినర్‌ను ఢీకొట్టింది. దీంతోకారు నుజ్జు నుజ్జు అవ్వడంతో డ్రైవింగ్‌ చేస్తున్న అనిల్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. కారు వెనకాల కూర్చున్న భార్య గీత ఎడమవైపు ఉన్న డోరు నుంచి బయటపడి తీవ్ర గాయాలపాలైంది. ఇద్దరు కుమారులు కారులోనే ఇరుక్కుని చనిపోయారు. గీత పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

nanireddy

nanireddy

Next Story