భార్య ఆపరేషన్ కు బయలుదేరి విగతజీవిగా మారిన భర్త..

భార్య ఆపరేషన్ కు బయలుదేరి విగతజీవిగా మారిన భర్త..
x
Highlights

మరి కొద్ది గంటల్లో భార్యకు ఆపరేషన్ జరగాల్సి ఉంది అందుకోసం డబ్బుతో ఆసుపత్రికి బయలుదేరిన భర్త అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు.. జయశంకర్‌ భూపాలపల్లి...

మరి కొద్ది గంటల్లో భార్యకు ఆపరేషన్ జరగాల్సి ఉంది అందుకోసం డబ్బుతో ఆసుపత్రికి బయలుదేరిన భర్త అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పెద్దాపురానికి చెందిన గూడూరు భిక్షపతి(54) గ్రామంలో ఆరెంపీగా బ్రతుకీడుస్తున్నాడు. అయనకు భార్య, మాజీ సర్పంచ్‌ అరుణ.. వారికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఇటీవల అరుణకు కుడి భుజం నొప్పి కారణంగా వైద్యులు ఆమెకు ఆపరేషన్ అవసరమని చెప్పారు. దీంతో
చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాడు భిక్షపతి. మంగళవారం ఆమెకు ఆపరేషన్ ఉన్నందున చేతిఖర్చుల నిమిత్తం డబ్బుకోసం హన్మకొండలోని తన తమ్ముడు వేణుప్రసాద్‌ ఇంటికి వెళ్లాడు.అనంతరం హన్మకొండ నుంచి ఉదయం 5 గంటల సమయంలో కాజీపేట రేల్వే స్టేషన్ కు చేరుకున్నాడు.. టిక్కెట్‌ తీసుకుని 2వ ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి. అపస్మారక స్థితిలో పడివున్న భిక్షపతిని చూసి కొందరు వ్యక్తులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వారు డాక్టర్లను తీసుకువచ్చి పరిశీలించారు. కానీ అప్పటికే బిక్షపతి మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు . బిక్షపతి మృతితో పెద్దాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories