మరోసారి ఆర్కే నగర్‌లో కలకలం..!

మరోసారి ఆర్కే నగర్‌లో కలకలం..!
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో కాళీ ఏర్పడిన ఆర్కేనగర్ స్థానానికి జరగాల్సిన ఉపఎన్నిక సంవత్సరం నుంచి ఊరిస్తున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడో ఏప్రిల్...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో కాళీ ఏర్పడిన ఆర్కేనగర్ స్థానానికి జరగాల్సిన ఉపఎన్నిక సంవత్సరం నుంచి ఊరిస్తున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడో ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఉపఎన్నిక డబ్బు పంపిణి చేస్తూ అడ్డంగా రాజకీయ పార్టీలు దొరికిపోవడంతో వాయిదా పడింది.. దీంతో డిసెంబర్‌ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆర్కేనగర్ లోని కొరుక్కుపేట్‌లోని ఓ సైకోథెరపీ సెంటర్‌లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే మరోసారి డబ్బు భారీ మొత్తంలో పోలీసుల కంటపడటంతో రాజకీయ పార్టీల్లో కలవరం మొదలయింది.. అసలు ఉపఎన్నిక జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అన్నంతగా టెన్షన్ నెలకొంది..

Show Full Article
Print Article
Next Story
More Stories