logo
సినిమా

శ్రీదేవి మృతిపై దర్శకుడు రాఘవేంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి

శ్రీదేవి మృతిపై దర్శకుడు రాఘవేంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి
X
Highlights

అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే...

అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీదేవి మృతిపై దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీరంగానికి తీరనిలోటన్నారు. అలాగే సినీరంగంలో శ్రీదేవి స్వయంకృషితో ఎదిగారని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

Next Story