ముక్కు చుట్టూ నల్లమచ్చలు పోవాలంటే ఇలా చేయాలి..

ముక్కు చుట్టూ నల్లమచ్చలు పోవాలంటే ఇలా చేయాలి..
x
Highlights

ముఖానికి కళ్ళు, ముక్కు అంధానిస్తాయి. అయితే కొందరికి ముక్కు చుట్టూ నలుపు రంగు ఏర్పడి అందానికి ఇబ్బందిగా మారుతుంది. ఇది ఎక్కువగా వేసవి, శీతాకాలంలో...

ముఖానికి కళ్ళు, ముక్కు అంధానిస్తాయి. అయితే కొందరికి ముక్కు చుట్టూ నలుపు రంగు ఏర్పడి అందానికి ఇబ్బందిగా మారుతుంది. ఇది ఎక్కువగా వేసవి, శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆయిలీ స్కిన్, పవర్ స్కిన్ లైట్ ప్రొడక్ట్స్ వాడకం వంటి కారణాలతో ముక్కు చుట్టూ నల్లగా తయారవుతుంది. ఇది ఎక్కువగా మహిళలకు ఉండటం చూస్తుంటాం.. అయితే ఇది పోవాలంటే రెగ్యులర్ గా కేర్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇది తగ్గడానికి ముక్కు చుట్టూ స్క్రబ్బింగ్స్ వాడకం అలవాటు చెయ్యాలి. మార్కెట్లో చాలా స్క్రబ్బింగ్స్ దొరుకుతాయి. వీటిలో ముఖ్యంగా ట్యమరింగ్ తో చేసిన స్క్రబ్ ని వాడితే మంచిది. ట్యమరింగ్ స్క్రబ్ కొంచెం తీసుకుని రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే సమయాల్లో అప్లై చేసి 2 నిమిషాల తరువాత రుద్దుకోవాలి. ఇలా అది పోయేంతవరకు వారానికి మూడురోజుల పాటు వాడాలి. అలాగే చాలామందికి ముక్కు చుట్టూ చర్మం అంతా డ్రై అయిపోతుంది. దీని కారణంగా ఆ ప్రదేశంలో రుద్దినప్పుడు చర్మం ఎరుపు రంగులో మారుతుంది. దీని నివారణకు ప్రొసెస్డ్ అలోవెరా జెల్, తేనె లను అప్లై చేసుకుంటే చర్మం డ్రై గా మారకుండా ఉంటుంది. ఇవి చర్మానికి కావలసిన హైడ్రేషన్ ను ఇస్తాయి. అలాగే ముక్కు చుట్టూ ఉన్న నల్ల మచ్చలు పోవాలంటే మరో చిట్కా.. నిమ్మకాయకు కొంచెం మీగడ అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్ లో దొరికే ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి రాసుకుంటే కూడా ఈ మచ్చలు దూరమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories