త్వరలో రేవంత్‌ పాదయాత్ర

త్వరలో రేవంత్‌ పాదయాత్ర
x
Highlights

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెకుటల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది....

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెకుటల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌-కృష్నా రైల్వేలైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలుడిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. బంరాస్‌ పేట, పరిగి,వికారాబాద్‌,. మన్నెగూడ,చేవేళ్ల, మెయినాబాద్‌ మీదుగా ఈ యాత్ర సాగునుంది.

కొడంగల్‌–హైదరాబాద్‌ మధ్య దూరం 120 కి.మీ. ఉంటుంది. రోజూ 15 కి.మీ. పాదయాత్ర చేసే అవకాశముంది. కొడంగల్, బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌ మీదుగా వికారాబాద్‌ చేరుకుంటారు. కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లిచౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకునే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories