logo
సినిమా

పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్...పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిన ప్రతిసారీ.. నేను వచ్చిసరిచేయాలా..?

పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్...పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిన ప్రతిసారీ.. నేను వచ్చిసరిచేయాలా..?
X
Highlights

సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ నుంచి బయటకు...

సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక .. పవన్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరుతో ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది. దీనిపై రేణు స్పందించారు. ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నరని తెలిపింది. దీని గురించి కొందరు సభ్యత లేకుండా, మరికొందరు భయపెడుతూ కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. కొందరేమో ఆ మాటలు తప్పు అని చెప్పాలంటూ అడుగుతున్నారని తెలిపింది. గత ఐదేళ్లుగా తన తప్పు లేకుండానే నిందలు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మాభిమానం గురించి ఎవరైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

అన్నీ మర్చిపోయి సైలెంట్ గా ఉండాలంటూ గత ఐదేళ్లుగా తనకు సూచిస్తున్నారని రేణు అన్నారు. తన ఆత్మాభిమాన్ని కాపాడుకోవడానికి ఏదైనా మాట్లాడితే, మౌనంగా భరించు అంటూ సలహా ఇస్తున్నారని చెప్పారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం తాను వ్యాఖ్యలు చేస్తున్నానంటూ మరికొందరు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ గారి ఇమేజ్ కి భంగం వాటిల్లితే, నేను వచ్చి సరిచేయాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి సమాజంలో జీవిస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. ఏదో ఒక రోజు తనకు ప్రశాంతత కలుగుతుందని భావిస్తున్నానని తెలిపారు. పవన్ గురించి తాను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడనని చెప్పారు.

Next Story