జియోకాయిన్ పై క్లారిటీ ఇచ్చిన రిల‌య‌న్స్

జియోకాయిన్ పై క్లారిటీ ఇచ్చిన రిల‌య‌న్స్
x
Highlights

టెలికాం రంగంలో దిగ్గ‌జాల‌ను మ‌ట్టిక‌రిపించిన రిల‌య‌న్స్ జియో గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వానికి...

టెలికాం రంగంలో దిగ్గ‌జాల‌ను మ‌ట్టిక‌రిపించిన రిల‌య‌న్స్ జియో గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వానికి ట్యాక్స్ క‌ట్టే అవ‌స‌రం లేకుండా.. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు డ‌బ్బును త‌యారు చేసుకునేలా...అవ‌స‌రంలేన‌ప్ప‌డు కంప్యూట‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రుచుకుంటే ఎలా ఉంటుందో అనే ఊహ‌నుంచి వ‌చ్చిందే బిట్ కాయిన్ . దీన్ని క్రిప్టోకరెన్సీ అని కూడా అంటారు. ఈ బిట్ కాయిన్ రంగంలో కి అడుగుపెట్టేందుకు రిల‌య‌న్స్ జియో ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. జియో కాయిన్ లైవ్‌మింట్‌ రిపోర్టు ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ జియో కాయిన్ పేరిట మార్కెట్లోకి తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది అధినేతగా ముఖేష్‌ పెద్ద కొడుకు.. దీనికి అధినేతగా ముఖేష్‌ పెద్ద కొడుకు ఆకాష్‌ అంబానీ సారధ్యం వహిస్తున్నట్లుగా ఆ రిపోర్టు తెలిపింది. మొత్తం 50 మంది యువకులతో కూడిన టీమ్ జియో కాయిన్ మీద కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బిట్ కాయిన్ ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బిట్ కాయిన్ చ‌ట్ట‌విరుద్ద‌మైంద‌ని..ఇందులో పెట్టుబ‌డులు పెట్టే ప్ర‌య‌త్నం చేయోద్ద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని దీనికి చట్టబద్దత లేదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.
దీంతో జియో కాయిన్ వ‌స్తుంద‌ని గుర్తించిన కొన్ని కంపెనీలో జియో కాయిన్ పేరుతో జియోకాయిన్ యాప్ ను త‌యారు చేసి మార్కెట్లోకి విడుద‌ల చేశారు. ఇదే జియోకాయిన్ యాప్ అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాదు గూగుల్ ప్లేస్టోర్ లో జియోకాయిన్ యాప్ ఉండ‌డంతో కంగుతిన్న జియో సంస్థ.. తాము ఎలాంటి యాప్ ల‌ను లాంచ్ చేయడం లేదని స్పష్టం చేసింది. జియో పేరుతో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మైనట్లు రిల‌య‌న్స్ జియో సంస్థ ప్ర‌క‌టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories