logo
జాతీయం

మరో ముందడుగు వేసిన జియో

మరో ముందడుగు వేసిన జియో
X
Highlights

టెలికాం దిగ్గజం జియో మరో ముందడుగు వేసింది.ఇప్పటికే టెలికాం రంగాన్ని ఒక ఊపు ఊపుతున్న ఈ సంస్థ తాజాగా ఇండియన్...

టెలికాం దిగ్గజం జియో మరో ముందడుగు వేసింది.ఇప్పటికే టెలికాం రంగాన్ని ఒక ఊపు ఊపుతున్న ఈ సంస్థ తాజాగా ఇండియన్ రైల్వేస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. జనవరి 1 నుంచి జియో సేవలను భారత రైల్వే వినియోగించుకుంటోంది. రైల్వేలో ఎయిర్ టెల్ నెట్ వర్క్ కలిగిన సుమారు 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లు క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల బిల్లు చెల్లిస్తోంది భారత రైల్వే శాఖ. అయితే జియో వాడకంతో ఈ బిల్లు ఒక్కసారిగా 35% తగ్గే అవకాశం ఉందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దాంతో దాదాపు 40 కోట్ల మేర ఖర్చు మిగిలే అవకాశముండటంతో.. జనవరి 1,2019 నుంచి జియోకు మారేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Next Story