శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి

శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి
x
Highlights

తుపాకుల మోతతో చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు మరోసారి దద్దరిల్లాయి. ఈ తెల్లవారుజామున అడవుల్లోకి ఏకంగా 50 మంది స్మగ్లర్లు చొరబడ్డారు. దీంతో...

తుపాకుల మోతతో చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు మరోసారి దద్దరిల్లాయి. ఈ తెల్లవారుజామున అడవుల్లోకి ఏకంగా 50 మంది స్మగ్లర్లు చొరబడ్డారు. దీంతో అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్మగ్లర్లను వెంబడించారు. దీంతో పోలీసులపై స్మగ్లర్ల రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి ఒకరౌండ్‌ కాల్పులు జరిపారు. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో దుండగులు అడవుల్లోకి పారిపోయారు. 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories