కారణం.. కోకోస్!

కారణం.. కోకోస్!
x
Highlights

అభికేంద్రం కూడా దాని వద్దే నమోదు మెక్సికో వ్యాలీ కిందే ఉన్న కోకోస్ ప్లేట్ అందులో ఘర్షణల వల్లే ఇంత తీవ్రత 1985లోనే జారిపోయిన పసిఫిక్ ప్లేట్ ...

  • అభికేంద్రం కూడా దాని వద్దే నమోదు
  • మెక్సికో వ్యాలీ కిందే ఉన్న కోకోస్ ప్లేట్
  • అందులో ఘర్షణల వల్లే ఇంత తీవ్రత
  • 1985లోనే జారిపోయిన పసిఫిక్ ప్లేట్
  • రింగ్ ఆఫ్ ఫైర్‌ను అంచనా వేయడం కష్టం

మెక్సికో: మెక్సికోను చిగురుటాకులా వణికించిన భూకంపానికి కారణం ఆ ఒక్క ప్లేటే కారణమా..? రెండు దశాబ్దాల క్రితం భూమి లోలోపలికి జారిపోయిన ఆ ప్లేటే ఇంత తీవ్రతకు కారణమైందా..? 1985 భూకంపానికి, తాజా భూకంపానికి లింకుందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని వందల మందిని సమాధి చేసిన భూకంపానికి కారణం ఒకేఒక్క టెక్టోనిక్ ప్లేట్‌లో జరిగిన రాపిడి ఫలితమేనని భూగర్భ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఆ ఒక్క ప్లేట్ ఏంటి..? అంటే 1985 భూకంపం గురించి చెప్పుకోవాలంటున్నారు.

కోకోస్ వద్దే...
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (టెక్టోనిక్ ప్లేట్లు ఎక్కువగా రాపిడికి గురయ్యే ప్రాంతం) చుట్టుపక్కల గల టెక్టోనిక్ ప్లేట్లు ఎక్కువగా రాపిడి (ఘర్షణ) గురవుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదా నికొకటి అతుక్కుని దగ్గరగా ఉండిపోవడం, కొన్ని వందల ఏళ్ల నుంచి వాటి మధ్య ఏర్పడిన బలాల ప్రభావం కార ణంగానే మెక్సికన్ టెక్టోనిక్ ప్లేట్‌పై భారం పడి అంత తీవ్రమైన ప్రకంపనలు వచ్చి ఉంటాయని అంటున్నారు. వాస్తవానికి అంత తీవ్రమైన భూకంపాలు గత పదిహే నేళ్లలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు అతి దగ్గరగా ఉండే ఇండోనేషియా, జపాన్, చిలీ వంటి దేశాల్లోనే చూశామంటున్నారు. మెక్సికో కూడా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఉన్నా.. 1985లో 8.0 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత ఎన్నడూ అలాంటి భూకంపం రాలేదని అంటున్నారు. ఆనాడు 70 కిలోమీటర్ల లోతున భూకంప అభికేంద్రంతో ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్‌తో మెక్సికో టెక్టోనిక్ ప్లేట్ ఎదురుగా ఢీకొట్టేసిందని వివరిస్తున్నారు.

తత్ఫలితంగా పసిఫిక్ సంద్రం అడుగున ఉండే కోకోస్ ప్లేట్ (భూపటలపు భాగం) భూమిలో చాలా లోతులోకి పడిపోయిందని చెప్పా రు. లోపలికి పడిపోతూ..పోతూ భూపటల శ్లాబ్‌ను బీటలు వారేలా చేసిందని, దాని వల్లే ఆ నాడు 8.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని చెబుతున్నారు. అప్పుడే అంత లోతులో అభికేంద్రం ఉంటే.. తాజాగా మాత్రం 50 కిలోమీటర్ల లోతులోనే ఉండడం ఆశ్చర్యపరిచే, ఆందోళనపరిచే అంశమని అంటున్నారు భూగోళ శాస్త్రవేత్తలు. అప్పుడు రెండు టెక్టోనిక్ ప్లేట్లు సంఘర్షణకు గురికావడం వల్ల మాత్రమే భూకంపం వచ్చిందని, ఇప్పుడు మాత్రం ఒక్క టెక్టోనిక్ ప్లేట్ లోపల సంభవించిన ఘర్షణల ఫలితమేనని అంటున్నారు. ఇంత తక్కువ లోతులోనే అభికేంద్రం ఉండడం, ఒక్క టెక్టోనిక్ ప్లేట్‌లోనే ఘర్షణలు రావడాన్ని చూస్తుంటే.. ఈ ప్రదేశంలోని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంచనాలకు అందకుండా ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. అది కూడా ఆనాడు భూమి లోపలకి జారిపోయిన కోకోస్ ప్లేట్ వద్దే 7.1 తీవ్రతతో అభికేంద్రం ఉండడం, అది కూడా మెక్సికో వాలీ కిందే ఉండడం మరింత తీవ్రతకు కారణై మెందని వివరిస్తున్నారు.

స్కూలు శిథిలాల కిందే చిన్నారి ప్రాణాలు..
భూకంపం ధాటికి మెక్సికోలోని ఎన్రిక్ రెబ్సామెన్ ప్రైమరీ స్కూలు కూలిపోయింది. ఆ స్కూల్లోని దాదాపు 21 మంది చిన్నారులు, ఐదుగురు పెద్దలు శిథిలాల కిందే సమాధి అయిపోయారు. ఆ స్కూలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యల్లో వలంటీర్‌గా పనిచేస్తున్న ఎన్రిక్ గార్డియా అనే వ్యక్తి.. థర్మల్ స్కానర్‌తో శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించాడు. శిథిలాల కింద చిన్నారులు బతికే ఉన్నారంటూ పెద్ద కేక వేశాడు. దీంతో వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకచోట ఎవరో గోడను పలుసార్లు కొట్టారని, తాము పంపించే సిగ్నళ్లకు స్పందించారని వివరించారు. ప్రస్తుతం ఆ స్కూలు వద్దే ఎక్కువ సంఖ్యలో సైన్యం, రెస్క్యూ బలగాలు, డాక్టర్లు, టీచర్లు ఉన్నారని అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories