బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ

బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో...

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణవారు విభజన కోరుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయన్నారు. ఏపీతో సంప్రదించాక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని, స్టేటస్ అనే పదం వాడకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. కొన్ని రోజుల పాటు రెవిన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సానుకూల దృక్పథం ఉందన్నారు. రెవిన్యూ లోటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని, దీనిలో రూ.138 కోట్లు మాత్రమే ఇవ్వవలసి ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories