ఆర్బీఐ మ‌రో సంచ‌ల‌నం..అందుబాటులోకి రానున్నడిజిట‌ల్ క‌రెన్సీ

ఆర్బీఐ మ‌రో సంచ‌ల‌నం..అందుబాటులోకి రానున్నడిజిట‌ల్ క‌రెన్సీ
x
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సెంట్రల్ బ్యాంక్...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వాటి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు సర్క్యులర్ జారీ చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుగోలు ఈ విషయాన్ని చెప్పారు. ‘‘ఇప్పటికే పలు దేశాల్లోని కేంద్ర బ్యాంకులు డిజిటల్ కరెన్సీపై చర్చిస్తున్నాయి. కాబట్టి భారత్‌లోనూ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ వినియోగ సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు అంతర శాఖా బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని ఆయన తెలిపారు. జూన్ చివరి నాటికి దానిపై ఆ బృందం నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.

వర్చువల్ కరెన్సీ వంటి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోందని, ఆర్థిక వ్యవస్థను మరింత సమ్మిళితం చేసేలా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేలా అవి దోహదపడతాయని, అందుకే సెంట్రల్ డిజిటల్ కరెన్సీపై దృష్టి సారించామని కనుంగో వెల్లడించారు. అయితే, బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీతో సంబంధమున్న వ్యాపార వర్గాలు, వ్యక్తులకు ఎలాంటి సేవలు అందించొద్దని, వారితో డీల్ వద్దని ఆయన ఆదేశించారు. ‘‘బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వాటిని వాడే వినియోగదారులు, వ్యాపారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. వాటి వల్ల ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ నియంత్రణలోని అన్ని బ్యాంకులకూ బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీని వాడే సంస్థలు, వ్యక్తులకు ఎలాంటి సేవలు అందించొద్దని ఆదేశించాం. అది వెంటనే అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి మరో సర్క్యులర్‌ను జారీ చేస్తాం’’ అని ఆర్బీఐ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories