logo
సినిమా

'అమర్ అక్బర్ అంథోని'

అమర్ అక్బర్ అంథోని
X
Highlights

ఒకప్పుడు ‘శ్రీను వైట్ల’ టాప్ లిస్టులో ఉన్న డైరెక్టర్ అయితే ఇప్పుడు కాస్త వెనుకంజలో వున్నాడనే చెప్పాలి. శ్రీను...

ఒకప్పుడు ‘శ్రీను వైట్ల’ టాప్ లిస్టులో ఉన్న డైరెక్టర్ అయితే ఇప్పుడు కాస్త వెనుకంజలో వున్నాడనే చెప్పాలి. శ్రీను వైట్ల కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ వంటి సినిమాలు ఈ డైరెక్టర్ ను బాగా దెబ్బతీసాయి. ఇప్పుడు మళ్ళీ తన కెరియర్ ను మలుపు తిప్పిన హీరోతో సినిమా తీయాలనుకుంటున్నారు శ్రీను వైట్ల.
త‌న స్నేహితుడు ర‌వితేజ హీరోగా మైత్రీమూవీమేక‌ర్స్ లో ఓ సినిమా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త‌కొద్దికాలంగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌తమ‌వుతున్న ర‌వితేజ రాజాదిగ్రేట్ తో పుంజుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస‌నినిమాలో జోరుమీదున్నాడు. అయితే శ్రీను వైట్ల - ర‌వితేజ గ‌తంలో వ‌చ్చిన వెంకీ, దుబాయ్ శీను బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోయే కొత్త చిత్రం అదే త‌ర‌హా కామెడీని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట డైర‌క్ట‌ర్. అంతే కాదు ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు 'అమర్ అక్బర్ అంథోని' అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిందని టాక్. త్రిపాత్రాభినేయం చేస్తున్న ర‌వితేజ డిఫ‌రెంట్ లుక్స్ తో క‌నువిందు చేయ‌నున్నాట‌. ర‌వితేజ‌కు త‌గ్గ‌ట్లు మూడు పాత్రల్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందట. రవితేజ ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలు అయిపోగానే రవితేజ, శ్రీను వైట్ల సినిమా మొదలు కాబోతునట్లు సమాచారం.

Next Story