పవన్ ఆశయాలు నచ్చి జనసేనలోకి-రావెల కిషోర్ బాబు

పవన్ ఆశయాలు నచ్చి జనసేనలోకి-రావెల కిషోర్ బాబు
x
Highlights

తెలుగు దేశం పార్టీ తనను అనేక విధాలుగా అవమానించిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. పని చేయకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యనించారు. గుంటూరులో...

తెలుగు దేశం పార్టీ తనను అనేక విధాలుగా అవమానించిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. పని చేయకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యనించారు. గుంటూరులో మంత్రులు పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మన్నవ సుబ్బారావులు ప్రతి విషయంలోనూ కలుగజేసుకునే వారని తెలిపారు. టీడీపీలో దళితులకు స్వేచ్ఛ లేదని వెల్లడించారు. పవన్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కిషోర్‌బాబు మాట్లాడుతూ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక టీడీపీ పార్టీని విడనని చెప్పారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎం‍తగానో నలిగిపోయానని, టీటీడిపై లో పదవి ఉంటుంది కాని పవర్స్‌ ఉండవని స్పష్టం చేశారు. మంచి సమాజం కోసం పవన్‌ ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో సమిధగా మారేందుకే జనసేన తీర్థంపుచ్చుకున్నానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories