దివ్యాంగురాలిపై మతప్రభోదకుడి అఘాయిత్యం

దివ్యాంగురాలిపై మతప్రభోదకుడి అఘాయిత్యం
x
Highlights

తన బోధనలతో ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైైపు తీసుకెళ్లాల్సిన ఓ మతప్రభోదకుడు దారితప్పాడు. మానవత్వం మరిచి ప్రవర్తించి మృగంలా మారి ప్రవర్తించాడు....

తన బోధనలతో ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైైపు తీసుకెళ్లాల్సిన ఓ మతప్రభోదకుడు దారితప్పాడు. మానవత్వం మరిచి ప్రవర్తించి మృగంలా మారి ప్రవర్తించాడు. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం జరిపి గర్భవతిని చేశాడు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఈఘటన జరిగింది. మండపేట మండలం అర్తమూరుకు చెందిన 54 ఏళ్ల శెట్టి దుర్గారావు అలియాస్ రాజారావు మత ప్రబోధకుడిగా ఉంటూ ఇంటింటికీ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు. ఇదే ప్రాంతంలో మూగ, నడవలేని స్థితిలో వున్న యువతిని ప్రార్థనా కార్యక్రమాలకు తీసుకువెళ్ళేవాడు. ఇటీవల యువతి కడుపు నొప్పి తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఏడు నెలల గర్భిణిగా గుర్తించారు. యువతి సైగల ద్వారా దుర్గారావే ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావుకే ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయినట్టు పోలీసులు గుర్తించారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన దుర్గారావుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories