logo
జాతీయం

దేశరాజధానిలో మరో దారుణం..

దేశరాజధానిలో మరో దారుణం..
X
Highlights

దేశరాజధానిలో లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.బుధవారం ఓ బాలికకు కూల్డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి దారుణానికి...

దేశరాజధానిలో లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.బుధవారం ఓ బాలికకు కూల్డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి దారుణానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్‌కు చెందిన ఓ యువకుడు స్థానిక మదర్సాలోనే నివసిస్తూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన 13ఏళ్ల బాలికను ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకువెళ్లాడు. అక్కడినుంచి మదర్సాకు తీసుకువెళ్లి మరో నిందితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆనవాళ్లు కనిపించకుండా అతని ఫోన్ తోపాటు బాధితురాలి ఫోన్ ను నీళ్లలో పడేశాడు. ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు .నిందితులు పరారీలో ఉన్నారు.

Next Story